![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjm7-p5HjXabD6hdVHS-kD0tm1GxpyG3wlgjMn4a6IU7CcO0ULnTGO-9Fhhq3gP0By3OE9XOgTM48WW_2jje46li9lMC_heiQ60Ap7SJw9QklpBxUhh3Tmw7ueYXbZdjdUnIthOcRon0L_B/s1600/Ramcharan+Tej.JPG) |
రాంచరణ్ తేజ్ |
ఆరంజ్ సినిమా తర్వాత ప్రారంభమైన
రాంచరణ్ కొత్త సినిమా
"మెరుపు" షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా
రాంచరన్ సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమాకి ఒప్పుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా విశేషమేమిటంటే
రాంచరన్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో మియామీ లోని
డేవిడ్ బార్టన్స్ జిం సెంటర్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తన ట్రైనర్ చాలా కఠినమైన శిక్షణ ఇస్తున్నాడని
చరణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇసుకలో 5 కిలోమీటర్లు పరుగెత్తించాడట. ఈ ఫిట్ నెస్ తర్వాత
రాంచరన్ ఎంత తాజా గా కనిపిస్తాడో చూడాలి.