Mamta Mohandas Marriage Completed



ప్రముఖ సినీ నటి మమతా మోహన్‌దాస్ వివాహం ఘనంగా జరిగింది. మమతా తన చిన్న నాటి స్నేహితుడు ప్రజీత్ పద్మనాభన్ ని కేరళ లోని ఒక ప్రముఖ హోటల్ లో ఘనంగా వివాహమాడింది. తెలుగు లో మమతా మోహన్‌దాస్ మంచి పేరు సంపాదించింది. ఈ వేడుకలకు ఇరువైపుల కి చెందిన బంధువులు, మిత్రులు , పలువురు మలయాళ సినీ ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది. మమతా మోహన్‌దాస్ నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఈ కొత్త జంటకి మనమూ శుభాకాంక్షలు అందిద్దాం.