Test Footer

Dono Ilmu News

Welcome Guys

Yahoo Messenger News

2leep.com
Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

PAWAN KALYAN NEW YOUTUBE ACCOUNT OPENED



టాలీవుడ్ పవర్‌స్టార్ పవణ్‌కళ్యాణ్ యూట్యూబ్ లో అకౌంట్ ఓపెన్ చేసాడని తెలుస్తోంది. కానీ అందులో ఇంతవరకు ఎటువంటి అప్‌డేట్స్ గానీ మెసేజెస్ కానీ పోస్ట్ చేయలేదు. అందువలన ఇది పవణ్ కళ్యాణ్ స్వయంగా ఓపెన్ చేసిన అకౌంటా లేక పవణ్ పేరు మీద ఎవరైనా ఓపెన్ చేసారా అనేది ఖచ్చితంగా తెలియట్లేదు. 


ఈ అకౌంట్ పవణ్ కళ్యాణ్ దే అయితే ప్రస్తుతం విడుదలకి సిద్దంగా ఉన్న పంజా చిత్రం యొక్క అప్‌డేట్స్ అందులో ఖచ్చితంగా ఉండేవి. ఈ తికమకపై పవణ్ నోరు విప్పితే గానీ అసలు సంగతి తెలియదు. 


Tags : Pawan Kalyan Youtube Account, Pawan Kalyan Twitter Account, Pawan Kalyan Facebook Account, Pawan Kalyan Online Account, Pawan Youtube Account, Pawan Kalyan Twitter Username
5:51 PM | 0 comments | Read More

రాంచరణ్ తేజ్ తో రచ్చ చేయనున్న కలర్స్ స్వాతి ?

కలర్స్ స్వాతి
రాంచరణ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం లో రూపొందుతున్న తాజా చిత్రం "రచ్చ". రాంచరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రమిది. ఇందులో రాంచరణ్ తేజ్ సరసన తమన్నా నటిస్తోంది. అయితే ఇందులో మరో హీరోయిన్ గా కలర్స్ స్వాతి ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య అంతగా అవకాశాలు లేని స్వాతి ఏకంగా రాంచరణ్ తేజ్ తో అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబైపోతుందట. మరి ఈ సినిమా తోనైనా ఈ యంగ్ గర్ల్ కి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి.
12:14 PM | 0 comments | Read More

లేడీ ఓరియంటెడ్ సినిమా లో నటి వేదిక ?

వేదిక
నటి వేదిక ప్రస్తుతం సుమంత్ తో నూతన చిత్రం లో నటిస్తుంది. ఇంతకు ముందు లారెన్స్ దర్శకత్వం లో ముని సినిమా లో నటించింది వేదిక. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వం లో తెలుగు మరియు తమిళ భాషలలో వస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం లో వేదిక ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముని సినిమా అప్పుడు ఏర్పడిన పరిచయం ఆధారంగానే లారెన్స్ వేదిక కి ఈ సినిమా లో మెయిన్ రోల్ ని కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
11:41 AM | 0 comments | Read More

బంగారం ప్రమోట్ చేయడమే, కొనడం కుదరదు - మహేష్ బాబు

మహేష్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు జాస్ అలూకాస్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీ కి మహేష్ బాబు బాగా ప్రమోట్ చేస్తున్నాడే కానీ ఒక్కసారి కూడా తన భార్య కోసం ఒక్క నగ కూడా కొనలేదట. మహేష్ బాబు మాట్లాడుతూ - " తన నగలు తనే కొనుక్కుంటుంది. అందువలన నేను కొనడం కుదరదు " అని తన భార్య నమ్రత గురించి చెప్పాడు. అలాగే తన రాబోయే చిత్రం "దూకుడు" తన కెరియర్ లో నే ఒక అద్భుత చిత్రంగా నిలిచిపోతుందని తెలిపాడు.
2:14 PM | 0 comments | Read More

రూమర్స్ కామన్ - ఆసిన్

ఆసిన్
కేరళ కుట్టి ఆసిన్ ఈ మధ్య బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే తన మనసు విప్పి కొన్ని నిజాలు చెప్పింది. సినిమా ల్లో ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తే వారిపై రూమర్స్ రావడం కామన్ అని పేర్కొంది. నా పై రూమర్స్ పెరిగిపోతున్నాయని పేర్కొంది. సినిమా ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తోంది. ఈ పదేళ్ళలో అనుభవం పెరిగిపోయింది. రూమర్స్ ని తేలికగా తీసుకుంటేనే మంచిదని గుర్తించిందట ఆసిన్. అందుకే ఈ మధ్యన తనపై ఏ రకమైన రూమర్స్ వచ్చినా హాయిగా నవ్వేస్తుందట ఆసిన్.
2:07 PM | 0 comments | Read More

బికినీ కాజల్ అగర్వాల్ ఏం చెబుతోంది ?

కాజల్ అగర్వాల్
ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న అగ్ర హీరోయిన్ లలో కాజల్ ఆగర్వాల్ ఒకరు. ఈ తరం హీరోలందరి తోనూ దాదాపుగా నటించింది కాజల్ ఆగర్వాల్. ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో నేను ఎంత మంది అగ్ర హీరో లతో ఎన్ని సినిమా లు చేసినప్పటికీ మన స్థానం అలాగే ఉంటుదని అనుకోకూడదు. ఇండస్ట్రీ కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. మన స్థానం ఇలాగే ఉండాలంటే కష్టపడటం ఒకటే మార్గం అని చెబుతోంది కాజల్ ఆగర్వాల్. అలాగే ఎంత డబ్బిచ్చిన ఎప్పటికీ బికినీ వేసుకునేది లేదని తేల్చి చెబుతోంది కాజల్ ఆగర్వాల్. తన గొడగరితనమే బికినీ కి అడ్డు అని చెబుతోంది కాజల్.
11:19 AM | 0 comments | Read More

రాజమౌళి భార్యకి పోటీ పెరుగుతుందా ?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి స్టయిలిస్ట్ గా చేస్తుంది. తన భర్త చేసే ప్రతీ సినిమాకి తనే స్టయిలిస్ట్ గా పని చేస్తోంది. ఆమె వర్క్ కూడా బాగుంటుందని పలువురు మెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ రంగం లోకి ప్రముఖ దర్శకులు, నిర్మాతల భార్యలు ప్రవేశిస్తున్నారు. శీను వైట్ల భార్య కూడా స్టయిలిస్ట్ డిజైన్ చేస్తోంది. ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి భార్య ప్రణతి రెడ్డి కూడా ఈ రంగం లోకి ప్రవేశించింది. సినీ రంగం లో తన కుటుంబ సభ్యులకు ఉన్న పలుకుబడి ఆధారం గా మంచి అవాకాశాలకైతే కొదువ ఉండదు. ప్రస్తుతం ఈమె నాగ చైతన్య, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం దడ కి పని చేస్తోంది. వీటిని బట్టి చూస్తే రమా రాజమౌళికి పోటీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. 
6:31 PM | 0 comments | Read More

టి వి 9 కి ఝలక్ ఇచ్చిన అల్లు అర్జున్

ప్రముఖ న్యూస్ చానల్ టి వి 9 ఏదైనా ప్రోగ్రాం చేస్తే అది ఎవరి పైనైనా సెటైర్ వేస్తూనో లేదా ఎవరికైనా ఝలక్ ఇస్తూనో ఉంటుంది. టి వి 9 కే ఝలక్ ఇచ్చాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మధ్యన అల్లు అర్జున్ కొత్త చిత్రం బద్రీనాథ్ ప్రమోషన్ లో భాగం గా టి వి 9 లో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం లో అల్లు అర్జున్ ఫోన్ ఇన్ కాల్ లు మాట్లాడుతుండగా ప్రోగ్రాం కి రాంచరణ్ తేజ్ కాల్ చేసి అందరిని ఆశ్చర్యం లో పడేశాడు. అప్పుడు టి వి 9 యాంకర్ మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అని అల్లు అర్జున్ ని ప్రశ్నించింది. దీనికి అల్లు అర్జున్..." మేమిద్దరం సినిమా చేయడానికి ఇబ్బంది ఏమీ లేదని మీ టి వి 9 వారు స్క్రిప్ట్ ఎప్పుడు సిద్దం చేస్తే అప్పుడే అని చెప్పి ఝలక్ ఇచ్చాడు. దీంతో యాంకర్ షాక్ కు లోనై నిశ్శబ్దం గా ఉండిపోయింది. కానీ బదులుగా మేము సిద్దం అని గానీ, స్క్రిప్ట్ రెడీ గా ఉందని గానీ జవాబు ఇవ్వలేక పోయింది". 
9:36 AM | 0 comments | Read More

ప్రియమణి పై పెరుగుతున్న వదంతులు - వివరణ

ప్రియమణి
ప్రస్తుతం అగ్ర హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న తార ప్రియమణి. ఈ మధ్య కాలంలో తనపై వదంతులు పెరిగిపోయాయి. ఎవరైనా హీరోయిన్ ఎక్కువ సినిమాలు చేస్తే వదంతులు రావడం సహజమే, కానీ ప్రియమణి పై మాత్రం శృతి మించి రూమర్స్ వస్తున్నాయి. ఓ సినిమా లో బికినీ ధరించినందుకు 20 లక్షలు తీసుకుందని, ఒక హీరో కారు కొనిచ్చాడని, మహేష్ బాబు తో సినిమా కి ఒప్పుకోలేదని ఇలా చాలానే వదంతులు వచ్చాయి. అయితే వీటి పై ప్రియమణి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.

                                               ప్రియమణి మాట్లాడుతూ... "ద్రోణ సినిమా లో బికినీ లో నటించినందుకు 20 లక్షలు తీసుకున్నానని చాలా రూమర్స్ వచ్చాయి.నేను ఎక్కువగా ఏమీ తీసుకోలేదు అన్ని సినిమాలలో ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నాను. మరియు మహేష్ బాబు తో సినిమా కి ఒప్పుకోలేదని చిన్న హీరోలతో సైతం సినిమాలు చేసే నేను మహేష్ బాబు తో సినిమా కి వద్దని అంటానని ఎలా అనుకుంటారు. నాకు హీరోతో సంబంధం లేదు. నా క్యారక్టర్ పై నే దృష్టి అని తెలిపింది ప్రియమణి. మళయాల నటుడు పృధ్వీరాజ్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఇంకేమీ లేదు.." అని వివరణ ఇచ్చింది ప్రియమణి.
9:18 AM | 0 comments | Read More

16 భాషల పాట తో వస్తున్న శంకర్

శంకర్
తన ప్రతీ సినిమా లోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలనుకునే దర్శకుడు శంకర్. ఈ సారి తన దృష్టి పాట పై పెట్టాడు. 3 ఈడియట్స్ తమిళ రీమేక్ చిత్రం "నన్‌బన్" లో ఈ ప్రయోగం చేయనున్నాడు. 16 భాషల సాహిత్యం తో ఈ పాటని రికార్డ్ చేశారు. ఈ పాటకి మదన్ కార్కీ సాహిత్యం అందించగా విజయ్ ప్రకాష్ దీనిని పాడడం జరిగింది. పాటలో కనిపించే లొకేషన్స్ కూడా ఇదివరకు ఎప్పుడు చూడని ప్రదేశాలని తెలుస్తోంది.
6:17 PM | 0 comments | Read More

రాంచరణ్ తో నటించట్లేదు

మీన
వి వి వినాయక్ దర్శకత్వం లో రాంచరణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం లో మీన నటిస్తోందనే వార్తలు వచ్చాయి. రాంచరణ్ తేజ్ కి అత్తగా మీన నటిస్తోందని సినీ వర్గాల్లో వార్తలు వచ్చాయి. అయితే ఈవిషయం పై మీన స్పష్టత తెచ్చింది. తను ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లోనూ నటించట్లేదని తనకి తన అయిదేళ్ళ పాప నైనికా ని చూసుకోవడం తోనే సరిపోతుందని తెలిపింది. ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లోనూ భవిష్యత్తు లో నటిస్తానేమో ఇప్పుడే చెప్పలేనని చెప్పింది.
5:17 PM | 0 comments | Read More

చిరంజీవి అల్లుడికి సుప్రీం కోర్టు లో చుక్కెదురు

చిరంజీవి రెండవ కూతురు శ్రీజ ను పెళ్ళి చేసుకున్న శిరీష్ వరకట్న వేధింపుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబాల మధ్య సామరస్య పూర్వకంగా చర్చలు నడుస్తున్నాయని త్వరలోనే సమస్య తొలగొపోతుందని తనకు ముందస్తు బెయిలు మంజూరు చెయ్యాలని శిరీష్ కోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్ కోర్టు లో బెయిల్ రానందున సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు శిరీష్. సుప్రీం కోర్టు కూడా బెయిల్ కి నిరాకరించింది.
11:53 AM | 0 comments | Read More

కమల్‌హాసన్ తో శ్రీయ

కమల్ హాసన్ - శ్రీయ
కమల్‌హాసన్ స్వంతం గా దర్శకత్వం వహిస్తూ హీరోగా చేస్తున్న తాజా చిత్రం "విశ్వరూబయ్". ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు కమల్‌హాసన్. అయితే ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. మొదటి హీరోయిన్ గా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్ హ నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం లో రెండవ హీరోయిన్ గా శ్రీయ ఎంపికయ్యిందట. అప్పట్లో శ్రీయ కమల్‌హాసన్ సరసన మర్మయోగి చిత్రం లో నటించాల్సి ఉంది. కానీ ఆ చిత్రం ఆగిపోవడం వలన కమల్‌హాసన్ సరసన నటించే అవకాశం కోల్పోయింది శ్రీయ. ఇప్పుడు ఈ విశ్వరూబయ్ చిత్రం ద్వారా మళ్ళీ ఆ అవకాశం దక్కించుకుంది శ్రీయ.

9:39 AM | 0 comments | Read More

నా మాటలను వక్రీకరించారు - ఇలియానా

ఇలియానా
గోవా సుందరి ఇలియానా ఈ మధ్య చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. శక్తి సినిమా విడుదల తర్వాత ఓ ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి లోనయ్యింది. శక్తి సినిమా ఫ్లాప్ అవుతుందని తనకి ముందే తెలుసని, ఫ్లాప్ అయిన సినిమా కి పబ్లిసిటీ చేసి లాభం లేదని ఇలా చాలా మాటలు చెప్పింది ఇలియానా అప్పట్లో . అయితే తాజాగా మాట్లాడుతూ మీడియా తన మాటలను వక్రీకరించిందని శక్తి సినిమా ఫ్లాప్ గురించి తను ఎప్పుడూ మాట్లాడలేదని, అలా అనే దాన్ని అయితే శక్తి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం లో డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్  ఎందుకిస్తానని అది తన సినీ జీవితం లో మొదటి స్టేజ్ షో అని చెప్పింది. ఈ మాటల తోనైనా జూనియర్ ఎన్ టి ఆర్ తో పాటు నందమూరి అభిమానుల కు మళ్ళీ దగ్గర అవ్వాలని అనుకుంటుందేమో మన ఇలియానా.


3:16 PM | 0 comments | Read More

వరుస చిత్రాలతో పండగ చేయనున్న రాంచరణ్ తేజ్

రాంచరణ్ తేజ్
ప్రస్తుతం రాంచరణ్ తేజ్ వరుసగా మూడు సినిమాలకు అంగీకరించాడు. ముగ్గురు అగ్ర హీరోయిన్ లతో రూపొందుతున్న ఈ చిత్రాలతో అభిమానులకు పండగ చేయనున్నాడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్. సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న "రచ్చ" సినిమా లో రాంచరణ్ తేజ్ సరసన తమన్నా జత కడుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం లో వస్తున్న చిత్రానికి సమంత హీరోయిన్ గా ఎంపికయ్యింది. తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రాంచరణ్ తేజ్ ఖరారు చేసుకున్న చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుందని ప్రాధమిక సమాచారం. తెలుగు సినిమా చరిత్రని తిరగ రాసిన మగధీర తర్వాత మరోసారి రాంచరణ్ తేజ్ సరసన నటించనుంది కాజల్ అగర్వాల్. మొత్తానికి రానున్న రోజుల్లో మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.


12:13 PM | 0 comments | Read More

విడుదలకు సిద్దమవుతున్న బద్రీనాథ్

బద్రీనాథ్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమన్నా జంటగా రూపొందిన తాజా చిత్రం "బద్రీనాథ్". వి.వి.వినాయక్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం జూన్ 10 వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ బద్రీనాథ్ చిత్రం పై సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. జూన్ 3 వ తేదీన ఈ చిత్రం సెన్సార్ కి వెలుతుంది. సెన్సార్ పూర్తవడంతో సినిమా విడుదలకు పూర్తి సనద్దం అయినట్టే. ఇటీవలే పాటల షూటింగ్ ఇటలీ లో పూర్తి చేశారు. బద్రీనాథ్ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లో నే ఒక అద్భుత చిత్రం గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.



12:02 PM | 0 comments | Read More

3 భాషల్లో భారీ ఎత్తున విడుదల అవుతున్న "బద్రీనాథ్"

బద్రీనాథ్
అల్లు అర్జున్, తమన్నా జంటగా రూపొందిన తాజా చిత్రం "బద్రీనాథ్". వచ్చే నెల 10 వ తేదీన ఘనంగా విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని 3 రాష్ట్రాల్లో, 3 భాషల్లో ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, మళయాలం 3 భాషాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ 3 రాష్ట్రాల్లోను ఈ సినిమా విడుదల కాబోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. అల్లు అర్జున్ కెరియర్ లోనే ఇది ఒక సూపర్ హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.
10:11 PM | 0 comments | Read More

అభిమానుల కోసం రజనీకాంత్ లేటెస్ట్ & రీసెంట్ ఫోటో

రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్ లో చేరిన నుంచి అభిమానులు, ప్రజలు ఎంతో ఆందోళన కి లోనవుతున్నారు. రజనీకాంత్ కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నా అభిమానుల్లో మాత్రం ఇంకా ఏదో చెప్పలేని అసంతృప్తి. ఎందుకంటే స్వయంగా రజనీకాంత్ ఫోటో గానీ వీడియో గానీ హాస్పిటల్ లో చేరిన తరువాత లభించకపోవడం. అయితే రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ ఉత్కంఠ కి తెర దించుతూ తన ట్విట్టర్ లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. రజనీకాంత్ తన కూతురితో ఎంతో ఉల్లాసంగా దిగిన తాజా ఫోటో అది. దీన్ని బట్టి రజనీకాంత్ ఆరోగ్యం కుదుటపడిందని చెప్పవచ్చు.


11:05 AM | 0 comments | Read More

రచయిత గా వస్తున్న మంచు మనోజ్


మంచు మనోజ్
మంచు మనోజ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం "మిస్టర్ నోకియా". అనిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమా లో ఒక పాటని మంచు మనోజ్ రాశాడు. ఇదివరకే తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మనోజ్ రచయితగా ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి.

11:09 PM | 0 comments | Read More

వీర మొదటి రోజు కలెక్షన్లు అదుర్స్


Veera Telugu Movie
రవితేజ, కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం "వీర" నిన్న (20-05-2011) ఘనంగా విడుదలయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విడుదల సాధించక పోయినప్పటికీ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. రవితేజ సినిమాలన్నింటిలోను "వీర" సినిమా మొదటి రోజు కలెక్షన్లు అదుర్స్ అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఆ కలెక్షన్లు ఇలా ఉన్నాయి...........

నైజాం - 90 లక్షలు
తూర్పు గోదావరి - 13 లక్షలు
నెల్లూరు - 10 లక్షలు
గుంటూరు - 20 లక్షలు
కృష్ణ - 19 లక్షలు
చిత్తూరు - 13 లక్షలు
కడప - 13 లక్షలు 


6:32 PM | 0 comments | Read More