ప్రముఖ న్యూస్ చానల్ టి వి 9 ఏదైనా ప్రోగ్రాం చేస్తే అది ఎవరి పైనైనా సెటైర్ వేస్తూనో లేదా ఎవరికైనా ఝలక్ ఇస్తూనో ఉంటుంది. టి వి 9 కే ఝలక్ ఇచ్చాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మధ్యన అల్లు అర్జున్ కొత్త చిత్రం బద్రీనాథ్ ప్రమోషన్ లో భాగం గా టి వి 9 లో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం లో అల్లు అర్జున్ ఫోన్ ఇన్ కాల్ లు మాట్లాడుతుండగా ప్రోగ్రాం కి రాంచరణ్ తేజ్ కాల్ చేసి అందరిని ఆశ్చర్యం లో పడేశాడు. అప్పుడు టి వి 9 యాంకర్ మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అని అల్లు అర్జున్ ని ప్రశ్నించింది. దీనికి అల్లు అర్జున్..." మేమిద్దరం సినిమా చేయడానికి ఇబ్బంది ఏమీ లేదని మీ టి వి 9 వారు స్క్రిప్ట్ ఎప్పుడు సిద్దం చేస్తే అప్పుడే అని చెప్పి ఝలక్ ఇచ్చాడు. దీంతో యాంకర్ షాక్ కు లోనై నిశ్శబ్దం గా ఉండిపోయింది. కానీ బదులుగా మేము సిద్దం అని గానీ, స్క్రిప్ట్ రెడీ గా ఉందని గానీ జవాబు ఇవ్వలేక పోయింది".