Test Footer

Dono Ilmu News

ప్రియమణి పై పెరుగుతున్న వదంతులు - వివరణ

ప్రియమణి
ప్రస్తుతం అగ్ర హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న తార ప్రియమణి. ఈ మధ్య కాలంలో తనపై వదంతులు పెరిగిపోయాయి. ఎవరైనా హీరోయిన్ ఎక్కువ సినిమాలు చేస్తే వదంతులు రావడం సహజమే, కానీ ప్రియమణి పై మాత్రం శృతి మించి రూమర్స్ వస్తున్నాయి. ఓ సినిమా లో బికినీ ధరించినందుకు 20 లక్షలు తీసుకుందని, ఒక హీరో కారు కొనిచ్చాడని, మహేష్ బాబు తో సినిమా కి ఒప్పుకోలేదని ఇలా చాలానే వదంతులు వచ్చాయి. అయితే వీటి పై ప్రియమణి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.

                                               ప్రియమణి మాట్లాడుతూ... "ద్రోణ సినిమా లో బికినీ లో నటించినందుకు 20 లక్షలు తీసుకున్నానని చాలా రూమర్స్ వచ్చాయి.నేను ఎక్కువగా ఏమీ తీసుకోలేదు అన్ని సినిమాలలో ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నాను. మరియు మహేష్ బాబు తో సినిమా కి ఒప్పుకోలేదని చిన్న హీరోలతో సైతం సినిమాలు చేసే నేను మహేష్ బాబు తో సినిమా కి వద్దని అంటానని ఎలా అనుకుంటారు. నాకు హీరోతో సంబంధం లేదు. నా క్యారక్టర్ పై నే దృష్టి అని తెలిపింది ప్రియమణి. మళయాల నటుడు పృధ్వీరాజ్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఇంకేమీ లేదు.." అని వివరణ ఇచ్చింది ప్రియమణి.