ప్రముఖ దర్శకుడు రాజమౌళి భార్య రమా రాజమౌళి స్టయిలిస్ట్ గా చేస్తుంది. తన భర్త చేసే ప్రతీ సినిమాకి తనే స్టయిలిస్ట్ గా పని చేస్తోంది. ఆమె వర్క్ కూడా బాగుంటుందని పలువురు మెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ రంగం లోకి ప్రముఖ దర్శకులు, నిర్మాతల భార్యలు ప్రవేశిస్తున్నారు. శీను వైట్ల భార్య కూడా స్టయిలిస్ట్ డిజైన్ చేస్తోంది. ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి భార్య ప్రణతి రెడ్డి కూడా ఈ రంగం లోకి ప్రవేశించింది. సినీ రంగం లో తన కుటుంబ సభ్యులకు ఉన్న పలుకుబడి ఆధారం గా మంచి అవాకాశాలకైతే కొదువ ఉండదు. ప్రస్తుతం ఈమె నాగ చైతన్య, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం దడ కి పని చేస్తోంది. వీటిని బట్టి చూస్తే రమా రాజమౌళికి పోటీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.