Test Footer

Dono Ilmu News

బద్రీనాథ్ లో హింస ఎక్కువైంది ?

బద్రీనాథ్
అల్లు అర్జున్, తమన్నా జంట గా వి వి వినాయక్ దర్శకత్వం లో రూపొందిన తాజా చిత్రం బద్రీనాథ్. అయితే ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 10 వ తేదీన విడుదలకి సిద్దంగా ఉంది. అయితే బద్రీనాథ్ సినిమా లో సెకండ్ హాఫ్ లో వయెలెన్స్ ఎక్కువగా ఉందని సెన్సార్ సభ్యులు భావించారట. అందువలన బద్రీనాథ్ సినిమా ని మళ్ళీ రీ-సెన్సార్ చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన అల్లు అరవింద్ నిరాశ కి లోనయ్యాడట. విడుదల తేదీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రీ సెన్సార్ అంటే విడుదలకి కష్టమవుతుందని అల్లు అరవింద్ భావిస్తున్నాడట. కానీ సెన్సార్ సభ్యులు మాత్రం బద్రీనాథ్ సినిమాని సోమవారం మళ్ళీ సెన్సార్ చేయడానికి తయారుగా ఉన్నట్లు సమాచారం.